స్వామీ! ఏమిటి ఈ ట్సునామీ?
26 డిశంబరు 2004 న ప్రొద్దున్నే మద్రాసులో 7 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది. మొత్తం అన్న్ని టీవీ చానెళ్ళూ దాన్ని గురించే వార్త లను అందించడం మొదలు పెట్టాయి. మా పనుల్లో మేము కొంత సేపటికి నిమగ్నమయాం. కాసేపటి తర్వాత అవే చానెళ్ళలో వార్తలు విషాదంగా మారాయి. జలప్రళయం వచ్చిందని ఒకటే మాట.
Saturday, January 08, 2005
Friday, January 07, 2005
తెలుగు చస్తోందా?
తెలుగు చస్తోంది, చస్తోంది అని చాలా మంది మొత్తుకుంటున్నప్పటికీ ఇంకా కొందరు మట్టుకూ నిమ్మకు నీరెత్తినట్లున్నారు. నిజంగా తెలుగు చస్తోందా? ఇదీ ప్రశ్న. ఏమో! కొందరేమో ఇంతకు మునుపెప్పటికన్నా తెలుగు వ్రాసేవారూ, మాట్లాడేవారూ, చదివేవారూ, ఇప్పుడే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్లు, ఈ విషయము కాస్త బోధపడకుండా వుంది. ఎవరైనా ఇటు వస్తే కాస్త విశదీకరించండి. నేటికి సుత్తి ఇంతే.
తెలుగులో వ్రాయగల్గటం నాకు నచ్చింది
తెలుగులో వ్రాయగల్గటం నాకు నచ్చింది అని అనగానే తెలుగులో తెగ వ్రాసేయగలనని భ్రమపడిపోతారేమో. పడకండేం! ఇదేదో కొత్తొక వింతా పాతొక రోతా అన్నట్లుంది. అంతే. త్వరలోనే, నేను నా దగ్గర ఉన్న తెలుగు సామెతలను ఇక్కడికి ఎక్కిద్దామని అనుకుంటున్నాను. చూద్దాం చేయగలనో లేదో.
పెద్దలకీ చిన్నలకీ అందరికీ వందనములు
పెద్దలకంటే పిన్నలే ఎక్కువ ఉనంట్లున్నారు ఈ వల మీద. వల అంటే నెట్ కి వచ్చిన అవస్థ అన్నమాట! కాబట్టి పిన్నలందరికీ ఆశీస్సులు. బ్లాగులను బాగు బ్లాగు అనేటట్లుగా రాసేస్తున్నారు. బ్లాగులు వర్ధిల్లాలని కోరుకుంటూ సత్య
Subscribe to:
Posts (Atom)